ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించిన.. లయన్ కాచం సత్యనారాయణ
ఆలేరుకు చెందిన పల్స వెంకులుకు సాయం
యాదాద్రి భువనగిరి జిల్లా… ఆలేరుకు చెందిన పల్స వెంకులు ఏడాది నుండి బ్రీథింగ్ సమస్యతో బాధపడుతున్నాడు. రెండు నెలల నుండి సమస్య తీవ్రం కావడంతో హైదరాబాద్ ecil సర్కిల్లో అపెక్స్ హాస్పిటల్లో ఆయన చికిత్సతీసుకున్నాడు. ప్రస్తుతం ఇంటివద్ద ట్రీట్మెంట్ తీసుకోవడం కోసం లియో.. సభ్యులు, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం క్లబ్ ప్రెసిడెంట్ లయన్ కాచం సత్యనారాయణ ను సంప్రదించారు. వారు వెంటనే ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందించారు. ఈ కార్యక్రమంలో లయన్ కాచం సాయి, ప్రవీణ్, కమల్ పాల్గొన్నారు.



