BLOOD DONATION CAMP


పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంధర్భంగా V3 న్యూస్‌ చానల్‌ చైర్మన్‌, కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరం ఏర్పాటు చేశారు. పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళి అర్పించారు. ACP శ్రీధర్‌ రెడ్డి, ట్రాఫిక్‌ సీఐ నాగమల్లు, లయన్‌ మెట్ల జగన్‌ ముఖ్య అథితులుగా హాజరయ్యారు. పోలీసుల త్యాగాలు మరువలేనివని పోలీసులవల్లే శాంతి భద్రతలు కలుగుతాయని చార్టర్‌ ప్రెసిడెంట్‌ లయన్ డాక్టర్‌ కాచం సత్యనారాయణ అన్నారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.ప్రతి ఒక్కరు రక్త దానం చేయాలని, రక్తదానం వల్ల ఎంతోమంది ప్రాణాలు నిలమడతాయని అన్నారు. రక్తదానం అంటే ప్రాణదానమని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌ acp శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. ips వ్యాస్‌, పరదేశీనాయుడు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. కరోనా సమయంలో పోలీసులు చేసిన సేవలను కొనియాడారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్న ci నాగమల్లు, శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్రని అన్నారు. గౌరవ అతిథిగా జోన్‌ చైర్‌ పర్సన్‌ మెట్ల జగన్‌ మాట్లాడుతూ.. లయన్స్‌ క్లబ్‌ హైదరాబాద్‌ సత్యం చేస్తున్న సేవలు మరవలేనివని కొనియాడారు. ఈ శిభిరంలో 22మంది రక్తదానం చేశారు.ఈ కార్యక్రమంలో చార్టర్‌ ప్రెసిడెంట్‌ లయన్ డాక్టర్‌ కాచం సత్యనారాయణ, ch శ్రీనివాసరావు, m. నరసింహ, లియో సూర్య భరద్వాజ్‌, లియో సాయి మణిదీప్‌,p. చిన్న, పరమేశ్‌ పాల్గొన్నారు. సంఘం బ్లడ్‌ బ్యాంక్‌ సిబ్బంది పి.కిరణ్మయి, జి.విజయ్‌ కుమార్‌, రవివర్మ దాతల నుండి రక్తం సేకరించారు.