సూర్యపేట జిల్లా నూతన్‌కల్‌ మండల వాసి పర్వతారోహకుడు బొజ్జ నవీన్‌కు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం

లయన్‌ కాచం శ్రీనివాస్‌ జన్మదినం సందర్భంగా.. లయన్స్ క్లబ్‌ ఆఫ్ హైదరాబాద్ సత్యం చార్టర్డ్‌ ప్రెసిడెంట్‌ లయన్‌ డా. కాచం సత్యనారాయణ ఆధ్వర్యంలో.. సూర్యపేట జిల్లా నూతన్‌కల్‌ మండల వాసి పర్వతారోహకుడు బొజ్జ నవీన్‌కు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్‌ ట్రాఫిక్‌ ఇన్స్‌స్టెక్టర్‌ అంజపల్లి నాగమల్లు హాజరయ్యారు..ఈ సందర్భముగా లయన్ డా కాచం సత్యనారాయణ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ అఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులు కాచం శ్రీనివాస్ జన్మదినం సందర్భముగా గతములో రెండు పర్వతాలు అధిరోహించి ఈ నెలలో కిల్లి మంజారో పర్వతాన్ని అధిరోహించేదుకు వెళుతున్న సూర్యాపేట జిల్లా వాసి బొజ్జ నవీన్ కు మా వంతు సహాయం అందించాలని ఉద్దేశ్యముతో లయన్స్ అఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యములో 10 వేల అందచేయడం జరిగింది అని తెలిపారు.. ఈ కార్యక్రమం లో , లయన్స్‌ క్లబ్‌ మెంబర్స్‌ , LIC శ్రీనివాస్‌, కళ్యాణ్‌, శ్రీధర్‌, కరీం తదితరులు పాల్గొన్నారు.