లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ఆధ్వర్యంలో ఆదివారం చైతన్యపురిలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం ప్రెసిడెంట్, వీ 3 న్యూస్ చైర్మన్ లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేఛ్చ అన్నారు. 75 ఏళ్ళ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ఈ వేళ రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా కల్పించడం ప్రతీ ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయమన్నారు. భారతదేశాన్ని ప్రపంచానికి మార్గదర్శిగా నిలపడానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులు ఏకసాయి, శ్రీనివాసరావు, శ్రీధర్, విద్యాసాగర్, సంతోష్, సురేందర్, లియో క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సత్యం సభ్యులు సుర్యభారద్వాజ్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.