లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ 320 (A) డిస్ట్రిక్‌ గవర్నర్‌ లయన్‌ S. రాధాకృష్ణ జన్మదినం

లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ సత్యం ఆధ్వర్యంలో లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ 320 (A) డిస్ట్రిక్‌ గవర్నర్‌ లయన్‌ S. రాధాకృష్ణ జన్మదినం సందర్భంగా.. బాలాపూర్‌లోని వాసవి కుటీర్‌ బ్యాంక్‌ మెన్‌ వయో వృద్ధుల ఆశ్రమంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మీర్‌పేట్‌ సి.ఐ మహేందర్‌రెడ్డి, బాలాపూర్‌ సి.ఐ భాస్కర్‌ హాజరైయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వయో వృద్థులను ఆదుకోవడంలో, అలాగే సమాజ సేవలో లయన్స్‌ క్లబ్స్‌ ఎంతో దోహదం చేశాయన్నారు. మెడికల్‌పరంగా, విద్యాపరంగా కూడా లయన్స్‌ క్లబ్‌ సేవలను వారు కొనియాడారు.
తెలంగాణ ఉద్యమం నాటి నుండి మిత్రుడు లయన్‌ కాచం సత్యనారాయణ.. కాచం foundation ఆధ్వర్యంలో నాటి నుండి నేటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మీర్‌సేట్‌ సి.ఐ మహేందర్‌ రెడ్డి తెలిపారు. సి.ఐ భాస్కర్‌ మాట్లాడుతూ.. గవర్నర్‌ లయన్‌ S. రాధాకృష్ణకు జన్మదినం శుభాక్షాంక్షలు తెలిపారు.అన్నదాన కార్యక్రమంతో పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్‌ కాచం సత్యనారాయణ మాట్లాడుతూ ..బాలాపూర్‌లోని వాసవి కూటీర్‌ బ్యాంక్‌ మెన్‌ వయో వృద్ధుల ఆశ్రమంలో ప్రతి నెల ఉచిత మెడికల్‌ క్యాంప్‌ నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో AVOPA బ్యాంక్‌ మెన్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ రమణయ్య, లయన్స్‌ క్లబ్‌ మెంబర్స్‌ కాచం సాయి, లయన్‌ LIC శ్రీనివాస్‌, భరత్‌రెడ్డి, సుధీర్‌కుమార్‌, శ్రీధర్‌, విద్యాసాగర్‌, సురేందర్‌, సంతోష్‌చారి, కూర రమేష్‌, నరేష్‌
లియో క్లబ్‌ మెంబర్స్‌ కాసం సంతోష్‌, శ్రీనాథ్‌రెడ్డి పాల్గొన్నారు